వైఎస్ జగన్‌తో కేసీఆర్‌ భేటీ..

వైఎస్ జగన్‌తో కేసీఆర్‌ భేటీ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌ను కేసీఆర్‌...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు. ఆహ్వానం అనంతరం వీరిద్దరూ పలు కీలక విషయాలపై భేటీలో చర్చించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రధాన సమస్యలు, నీతి అయోగ్‌లో జగన్ ప్రసంగం, ప్రత్యేక హోదాతో పాటు పలు విషయాలపై చర్చించబోతున్నారని తెలుస్తోంది.

అసెంబ్లీ నుంచి ఇంటికి జగన్..!

ఇదిలా ఉంటే.. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన జగన్ అక్కడ్నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదారంగా జగన్ ఆహ్వానించారు. కేసీఆర్‌ వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు.

కేసీఆర్‌కు ఘన స్వాగతం..

హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. కేసీఆర్‌కు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన వెళ్లి కనకదుర్గమ్మ దర్శించుకున్నారు. అనంతరం నేరుగా జగన్ నివాసానికి చేరుకొని.. ఆయనతో కేసీఆర్ భేటీ అయ్యారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories