ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటికి కేసీఆర్

ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటికి కేసీఆర్
x
Highlights

తిరుమల పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌కు...

తిరుమల పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌కు వైసీపీ శ్రేణులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. తుమ్మలగుంటలో చెవిరెడ్డి నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కేసీఆర్ దర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ నిన్న సాయంత్రం వెళ్లారు. రాత్రి అక్కడే బస చేసిన కేసీఆర్ ఇవాళ తెల్లవారుజాము మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. చెవిరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంటకు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories