Top
logo

నేటి నుంచి ప్రాజెక్టుల బాటపట్టనున్న తెలంగాణ సీఎం

cm kcrcm kcr
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ , రేపు ప్రాజెక్టుల బాట పడుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి టూర్ నీటి ప్రాజెక్టుల పరిశీలనకే శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాలకు సాగునీరందే లక్ష్యంతో ముందుకెళుతున్న సీఎం ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి దిశానిర్దేశం చేయనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ , రేపు ప్రాజెక్టుల బాట పడుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి టూర్ నీటి ప్రాజెక్టుల పరిశీలనకే శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాలకు సాగునీరందే లక్ష్యంతో ముందుకెళుతున్న సీఎం ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి దిశానిర్దేశం చేయనున్నారు. తనతో పాటు నీటి పారుదల రంగ నిపుణులు , మాజీ అధికారులు, ఇంజనీర్లతో కలిసి ఆయన కాళేశ్వరానికి వెళుతున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సందర్శనకు బయలుదేరుతారు.

ఒంటి గంటకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూపూర్ మండలంలోని మేడిగడ్డకు చేరుకుంటారు. ఇక్కడ గోదావరి నదిపై తెలంగాణ , మహారాష్ట్ర మధ్య నిర్మిస్తున్న బరాజ్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1.50 గంటలకు మేడిగడ్డ నుంచి బయల్దేరి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు కన్నెపల్లి వద్ద నిర్మిస్తున్న పంప్ హౌస్ ను సందర్శిస్తారు. తర్వాత పంప్ హౌస్ వద్ద ఉన్న కార్యాలయంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సాగునీటి శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు.

మొదట మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని అక్కడ పనులను పరిశీలిస్తారు. అనంతరం కన్నెపల్లిలో జరిగే పనులను పరిశీలించి అధికారులతో కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌజ్ , అన్నారం బ్యారేజీ, సుందిళ్ల పంపు హౌజ్ ల నిర్మాణాలు ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం గోలివాడ పంప్ హౌజ్ వద్దకు వెళ్లి పరిశీలిస్తారు. సాయంత్రం కరీంనగర్ తీగల గుట్టకు చేరుకుని అక్కడే బస చేస్తారు.

బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీకి నీరందించే శ్రీరామ సాగర్ ప్రాజెక్టు పునజ్జీవన పథకం పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. రాజేశ్వర్ రావుపేట , రాంపూర్ లలో నిర్మాణంలో ఉన్న పంపు హౌజ్ పనులను పరిశీలిస్తారు. ప్రాజెక్టుల పర్యటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ప్రాజెక్టులపై ప్రగతి భవన్ లో 3 లేదా 4న సమీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణ రిటైర్డు ఇంజనీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణ పనులను సోమవారం పరిశీలించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు జరుగుతున్న పనులు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రికి నివేదించింది. ఎక్కువ భాగం పనులు ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని రాతి కట్టడాల పనుల్లో వేగం పెంచాల్సి ఉందని నివేదించించింది.

Next Story