తెలంగాణ కొత్త సచివాలయం ఎక్కడనే సస్పెన్షన్ వీడింది

తెలంగాణ కొత్త సచివాలయం ఎక్కడనే సస్పెన్షన్ వీడింది
x
Highlights

తెలంగాణ కొత్త సచివాలయం ఎక్కడనే సస్పెన్షన్ వీడింది. ప్రస్తుతం ఉన్న స్థానంలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....

తెలంగాణ కొత్త సచివాలయం ఎక్కడనే సస్పెన్షన్ వీడింది. ప్రస్తుతం ఉన్న స్థానంలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణం కోసం రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం 4నుంచి 5లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే విధంగా కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కొంతకాలంగా నానుతూ వస్తున్న కొత్త సచివాలయం నిర్మాణం చిక్కుముడి వీడింది. మొదట సికింద్రాబాద్ బైసన్ పోల్ మైదానంలో సెక్రటేరియట్ నిర్మించాలని సర్కార్ భావించింది. అయితే ఆ స్థలాన్ని కేటాయించేందుకు కేంద్రం ఆసక్తి చూపలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న స్థలంలోనే కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుత సచివాలయంలో సగం భవనాలు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ సీఎం జగన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఆ భవనాలను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకుని కొత్త సెక్రటేరియట్ పనులు మొదలు పెట్టనున్నారు.

తాజా ప్రతిపాదనల ప్రకారం ముందుగా తెలంగాణ మంత్రులు, అధికారుల సెక్షన్లు ఖాళీ చేయిస్తారు. ఆయా కార్యాలయాలను ఇన్నాళ్లు ఏపీ ఆధీనంలో ఉన్న జె, ఎల్, కె, హెచ్ బ్లాకుల్లో ఏర్పాటు చేస్తారు. దాంతో తెలంగాణ భవనాలైన ఏ, బి, సి, డి బ్లాకులు ఖాళీ అవుతాయి. అప్పుడు వాటిని కూల్చివేసి వాటి స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తారు.

కూల్చివేసిన భవనాల స్థానంలో 10 నుంచి 12 అంతస్తులతో ఒకే భవన సముదాయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. అలాగే ముఖ ద్వారాన్ని కూడా అద్భుతమైన డిజైన్లతో ఏర్పాటు చేయనున్నారు. ఏడాది, ఏడాదిన్నరలోపు కొత్త సచివాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త సచివాలయం పూర్తయ్యాక ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలు కూల్చివేసి ఆ ప్రాంతాన్ని వివిధ మౌలిక వసతుల కోసం ఉపయోగిస్తారు. ఇక్కడే పెద్ద గ్రౌండ్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్రవతరణ వేడుకలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఇక్కడే నిర్వహించే యోచనలో సర్కార్ ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories