తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు

cmkcr
x
cmkcr
Highlights

తెలంగాణ కేబినేట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నామినేటెడ్‌ సభ్యుడు కూడా ఇతర సభ్యులతో పాటుగా ప్రమాణస్వీకారం చేయాడానికి వీలుగా నియామకం చేపట్టాలని నిర్ణయించారు.

తెలంగాణ కేబినేట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నామినేటెడ్‌ సభ్యుడు కూడా ఇతర సభ్యులతో పాటుగా ప్రమాణస్వీకారం చేయాడానికి వీలుగా నియామకం చేపట్టాలని నిర్ణయించారు. నామినేటేడ్‌ సభ్యుడు ఆలస్యంగా నియమించాల్సి వస్తుందని దీనివల్ల విలువైన పదవీకాలాన్ని కోల్పోతున్నారని ఈ సమస్యను నివారించేందుకు ముందుగానే నామినేటెడ్‌ సభ్యుడి నియామకానికి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో నామినేటెడ్‌ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఆంగ్లో ఇండియన్‌ స్టీఫెన్‌ సన్‌ను నయమించాలని నిర్ణయించారు. ఇక ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ నియమించారు. తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌ను కొనసాగిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్టీఫెన్‌ సన్‌ నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపిన వెంటనే.. గెజిట్‌ విడుదలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories