Top
logo

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు?

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు?
Highlights

కాసేపట్లో సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో రెండో విడత 10 మంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం...

కాసేపట్లో సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో రెండో విడత 10 మంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చేశారు. మంత్రులకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో నలుగురు గతంలో కేసీఆర్‌ కేబినెట్‌లో నిర్వహించగా తొలిసారి ఆరుగురికి చోటు దక్కింది.

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రులకు శాఖలు కేటాయించినట్లు తెలిసింది. నిరంజన్ రెడ్డికి ఆర్థికశాఖ, ఈటెల రాజేందర్ కు సంక్షేమ శాఖ, కొప్పుల ఈశ్వర్‌ కు విద్యాశాఖ, ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యవసాయ శాఖ, తలసాని శ్రీనివాస యాదవ్‌కు పౌరసరఫరాల శాఖ, వేముల ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమల శాఖ, ఇంద్రకరణ్‌రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ, శ్రీనివాసగౌడ్‌కు మున్సిపల్, ఎక్సైజ్ శాఖ, జగదీశ్వర్ రెడ్డికి రోడ్లు భవనాల శాఖ, మల్లారెడ్డికి విద్యుత్ శాఖ కేటాయించే అవకాశం ఉంది.

నిరంజన్ రెడ్డి ఆర్థిక శాఖ ?

ఈటెల రాజేందర్ సంక్షేమ శాఖ ?

కొప్పుల ఈశ్వర్ విద్యా శాఖ ?

ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవసాయ శాఖ ?

తలసాని శ్రీనివాస యాదవ్ పౌర సరఫరాల శాఖ ?

మేముల ప్రశాంత్ రెడ్డి పరిశ్రమల శాఖ ?

ఇంద్రకరణ్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ?

శ్రీనివాసగౌడ్ మున్సిపల్ శాఖ, ఆబ్కారీ ?

జగదీశ్వర్ రెడ్డి రోడ్లు, భవనాలు, ట్రాన్స్‌పోర్ట్ ?

మల్లారెడ్డి విద్యుత్ శాఖ ?

Next Story