logo

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్

cm kcrcm kcr
Highlights

తెలంగాణ కేబినెట్‌లో బెర్త్ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులపై ఎన్నికల సంఘం నీళ్ళు చల్లింది. పంచాయతీ ఎన్నికల కారణంగా మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం కాబోతోంది.

తెలంగాణ కేబినెట్‌లో బెర్త్ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులపై ఎన్నికల సంఘం నీళ్ళు చల్లింది. పంచాయతీ ఎన్నికల కారణంగా మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం కాబోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలింగ్ పూర్తయ్యే వరకు కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. కేబినెట్‌ విస్తరణ ఆలస్యం అవుతుందని తెలిసుకుని మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరాశలో మునిగిపోయారు.

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేపట్టడానికి వీల్లేదు.

ముహూర్తాలు లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. సంక్రాంతి పండుగ తర్వాత క్యాబినెట్ విస్తరించాలని భావించారు. ఆరు నుంచి ఎనిమిది మందితో విస్తరణ ఉంటుందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈలోపే పంచాయితీ ఎన్నికల షెడ్యల్ విడుదలైంది. దీంతో ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అంటే పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రి వర్గ విస్త్రరణ జరిగే అవకాశం లేదు. ఈ నెలాఖరువరకు ఎన్నికల ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరిలో మంత్రి వర్గ విస్త్రరణ జరిగే అవకాశం ఉంది.

శాసన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఫిబ్రవరిలోనే ఉండే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. పంచాయతీ ఎన్నికల హడావిడిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారో లేదో అనుమానంగానే ఉంది. ఇక ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంతేకాదు బతుకమ్మ చీరల పంపిణీ, రైతుబందు చెక్కుల పంపిణీ, సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ కూడా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది.

ఎన్నిక కోడ్ అమల్లో ఉన్ననేపథ్యంలో ఎవరైనా 50 వేలు మాత్రమే వెంట తీసుకు వెళ్లే అవకాశం ఉంది. అంతకు మించి తీసుకెళ్తే ఆ డబ్బుని సీజ్ చేస్తారు. మద్యం సరఫరాపై కూడా ఎన్నికల సంఘం నిఘా ఏర్పాటు చేసింది.

లైవ్ టీవి

Share it
Top