logo

బడ్జెట్‌ ప్రవేశపెట్టేది సీఎం కేసీఆర్‌... చరిత్రలో తొలిసారి!!

బడ్జెట్‌ ప్రవేశపెట్టేది సీఎం కేసీఆర్‌... చరిత్రలో తొలిసారి!!

రెండో దఫా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌ సర్కారు రేపు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా సభలో బడ్జెట్‌ ప్రసంగం చేయనున్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగనున్న బడ్జెట్‌ 2 లక్షల కోట్లను దాటనుందని తెలుస్తోంది. మరోవైపు మూడు రోజుల బడ్జెట్‌ సమావేశాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలా 30 నిముషాలకు ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నప్పటికీ యేడాదికి అవసరమైన ప్రణాళికతో బడ్జెట్‌ ఉంటుందని చెబుతున్నారు. దీంతో బడ్జెట్‌ 2 లక్షల కోట్లను దాటనుందని తెలుస్తోంది.

సీఎం కేసీఆరే స్వయంగా చదివి వినిపించనున్న బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ది పథకాలకు సంబంధించి కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలైన నిరుద్యోగ భృతి, రైతు బంధుకు అదనంగా 2 వేలు, ఆసరా పెన్షన్ల రెట్టింపు, రైతులకు లక్ష వరకు రుణమాఫీ వంటి పథకాలకు పూర్తిస్థాయిలో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. మరోవైపు గురువారం సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ సమావేశమైంది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులంతా కలిసి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినేట్‌ ఆమోదం తెలిపింది.

మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల కోసం పోలీసు శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో భద్రతను ఏర్పాటు చేశారు. శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల కోసం స్పీకర్‌ పోచారం అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.

లైవ్ టీవి

Share it
Top