తెలంగాణ పద్దు...తాత్కాలిక బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

తెలంగాణ పద్దు...తాత్కాలిక బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
x
Highlights

తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపట్టాలని ప్రభుత్వం...

తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అవసరమయ్యే నిధులపై అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. సుమారు రెండు లక్షల కోట్లకు బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నారని సమాచారం. మరో వైపు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి బడ్జెట్ సమావేశాలు పూర్తి చేయాలని యోచిస్తున్న సర్కార్ ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్దమవుతోంది.

కేంద్రం తరహలోనే తెలంగాణలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తుంది. బడ్జెట్ కేటాయింపులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ కంటే సుమారు 15 శాతం వృద్ధితో 2019 -20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. ఇది తాత్కాలిక బడ్జెట్ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అర్ధిక శాఖ అధికారులు అంటున్నారు.

ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టిన ఆర్ధిక శాఖ అధికారులు కీలకమైన పథకాలకు ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తేల్చారు. ఆసరా పెన్షన్ పథకానికి ఇప్పటి వరకు ఏడాదికి 6,600 కోట్లు ఖర్చవుతోంది వచ్చే ఏడాది నుంచి 13,200 కోట్లు అవుతుంది 57 ఏళ్లు నిండిన వారికి ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసరా పెన్షన్లకు ఏడాదికి 15 వేల కోట్లు కేటాయించాలని అంచనా వేస్తున్నారు.

ఇక రైతుబంధు పథకానికి 15 వేల కోట్లు అవసరమని ఆర్ధిక శాఖ ప్రాథమిక లెక్కల్లో తేలింది. లక్ష లోపు రుణాల మాఫీకి 24 వేల కోట్లు అవసరమని గుర్తించారు. రుణమాఫీ కి అవసరమైన నిధులను గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా చెల్లించే విధంగా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక నిరుద్యోగుల సంఖ్య ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో ఈ పథకానికి నిధులు కేటాయించలేమని ఆర్ధిక శాఖ చెబుతోంది. దీంతో నిరుద్యోగుల సంఖ్య తేలే వరకు నిరుద్యోగ భృతి పథకానికి నిధుల కేటాయింపు ఉండక పోవచ్చు. ప్రస్తుతం ఆర్ధిక మంత్రి లేకపోవడంతో బడ్జెట్ వ్యవహారాలన్ని చూస్తున్న సీఎం కేసీఆరే బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించోబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories