Top
logo

కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారు-లక్ష్మణ్‌

కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారు-లక్ష్మణ్‌
Highlights

తెలంగాణలో 16 పార్లమెంట్‌ స్థానాలు గెలుస్తామని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు...

తెలంగాణలో 16 పార్లమెంట్‌ స్థానాలు గెలుస్తామని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. హెచ్ఎంటీవీతో మాట్లాడిన లక్ష్మణ్‌ పాలనపై కంటే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకోవడంపైనే కేసీఆర్‌ దృష్టి పెట్టారని మండిపడ్డారు. రేపు జరగబోయే ఐదు పార్లమెంట్‌ క్లస్టర్ల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్లొంటారని తెలిపారు. నిజామాబాద్‌ వేదికగా పార్లమెంట్‌ ఎన్నికలకు సమర శంఖం పూరిస్తామంటున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌. అలాగే డేటా వివాదంపై మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జగుతున్న డేటా చోరీ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్ధతో విచారణ జరిపించాలని టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో అయితేనే నిజానిజాలు బయట పడతాయని అన్నారు. డేటా చోరీ వ్యవహారం ప్రజల వివాదం కాదనీ..కేవలం పోలీసుల మధ్య వివాదమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Next Story