Top
logo

తెలంగాణలో బీజేపీ తాజా వ్యూహం...5 పార్లమెంట్ సీట్లపైనే బీజేపీ గట్టి దృష్టి

తెలంగాణలో బీజేపీ తాజా వ్యూహం...5 పార్లమెంట్ సీట్లపైనే బీజేపీ గట్టి దృష్టి
X
Highlights

తెలంగాణ బీజేపీ కేవలం ఐదు పార్లమెంటు స్థానాల పైనే దృష్టి పెట్టబోతోందా...? మిగతా పన్నెండు స్థానాల్లో నామమాత్రంగా ...

తెలంగాణ బీజేపీ కేవలం ఐదు పార్లమెంటు స్థానాల పైనే దృష్టి పెట్టబోతోందా...? మిగతా పన్నెండు స్థానాల్లో నామమాత్రంగా పోటీ చేయాలని భావిస్తుందా....? అసెంబ్లీ ఎన్నికల ఘోర ఓటమి నేపథ్యంలో అధిక స్థానాల కోసం ఆశకు పోకుండా గెలిచే అవకాశం ఉన్న సీట్లలోనే గట్టి పోటీ ఇవ్వాలని ఆలోచనలు చేస్తుందా ...? ఆ తరహా ఆలోచన నిజమే అంటున్నాయి పార్టీ వర్గాలు.

అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం నేపథ్యంలో బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు స్థానాలపైనే దృష్టి పెట్టనుంది. మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా, 5 సీట్లపైనే కమలనాథులు గురి పెడుతున్నారు. మిగతా స్థానాల్లో నామమాత్రంగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

పార్లమెంటు ఎన్నికలో అనుసరించే వ్యూహం పై బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అన్ని స్థానాల్లో కాకుండా గెలిచే అవకాశం ఉన్నచోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి విజయం కోసం కృషి చేయాలని నిర్ణయించారు.

సికింద్రాబాద్ ,మల్కాజిగిరి , ఆదిలాబాద్ , నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఐదు స్థానాల్లో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు వచ్చాయి. సీరియస్ గా ప్రయత్నం చేస్తే ఈ ఐదుసీట్లలో బీజేపీ గెలువొచ్చని కమలనాథులు భావిస్తున్నారు. కొత్త వ్యూహం, పరిమిత స్థానాల్లో గట్టి పోటీ బీజేపీకి ఏ మేరకు లబ్ధి కలిగిస్తుందో వేచి చూడాలి.

Next Story