Top
logo

బడ్జెట్ కు సభ ఆమోదం : అసెంబ్లీ నిరవధిక వాయిదా

బడ్జెట్ కు సభ ఆమోదం : అసెంబ్లీ నిరవధిక వాయిదా
X
Highlights

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్యవినిమయ బిల్లు- 2019కు ఆమోదం...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్యవినిమయ బిల్లు- 2019కు ఆమోదం లభించింది. మొత్తం నాలుగు బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. మూడు రోజుల సమావేశాల్లో 10 గంటల నాలుగు నిమిషాల పాటు సభ జరిగింది. మొత్తం 29 మంది సభ్యులు మాట్లాడారు.

ఈ నెల 22న 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1,82,017 కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ నెల 22న బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా 23న బడ్జెట్‌పై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కూడా జరిగింది.

Next Story