Top
logo

తెలంగాణకు రెండు జాతీయ పురస్కారాలు

తెలంగాణకు రెండు జాతీయ పురస్కారాలు
X
Highlights

తెలంగాణకు రెండు జాతీయ పురస్కారాలు వచ్చాయి. పల్లెల్లో మహిళా శిశు సంరక్షణకు నిరంతం కృషి చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు జాతీయ అవార్డులు దక్కించుకున్నారు.

ప్రవాసీ భారతీయ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు జాతీయ పురస్కారాలు అందజేశారు. పల్లెల్లో మహిళా శిశు సంరక్షణకు నిరంతం కృషి చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. ఢిల్లీలో ప్రవాసీ భారతీయ కేంద్రంలో మంత్రి మేనకగాంధీచే వీరిరువురికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన అంగన్వాడీ కార్యకర్త సుశీల, వికారాబాద్ జిల్లాకు వికారాబాద్ మండలం సిద్దులూర్ గ్రామ అంగన్వాడీ కార్యకర్త విజయ లక్ష్మి పురస్కారాలు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తాము ఎన్నోరోజుల నుండి తమ గ్రామాల్లో చేస్తున్న పనిని గుర్తించి తమకు ఈ అవార్డులు అందజేయటం చాలా గర్వంగా ఉందని అన్నారు. తామకు దక్కిన ఈ అవార్టులు తాము జీవితంలో మరిచిపోలేమని పురస్కగ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story