ఇరాక్‌లో ఇందూరు అన్నదాతలు

Iraq
x
Iraq
Highlights

నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ఉపాధి కోసం ఏడారి దేశానికి వెళ్లిన వారు ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లిన 15 మంది ఇరాక్ లో చిక్కుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ఉపాధి కోసం ఏడారి దేశానికి వెళ్లిన వారు ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లిన 15 మంది ఇరాక్ లో చిక్కుకున్నారు. విజిట్ వీసాల మీద పంపించి ఏజెంట్లు మోసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

దేశం కాని దేశంలో నానా కష్టాలు పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలంటూ ఏజెంట్ చెప్పిన మాటలతో మంచి జీతం, జీవితంపై కలలు కన్నారు. కష్టాలన్నీ తీరుపోతాయనుకున్నారు. ఉన్న కొద్ది పొలం, బంగారం అమ్మి , అప్పులు చేసి ఏజెంట్ చెప్పినట్లు తలా 2 లక్షల దాక చేతిలో పెట్టారు. విమానమెక్కి విదేశాలకైతే వెళ్లారు. కానీ అక్కడ వారి కష్టాలు తీరక ఇంక రెట్టింపయ్యాయి. భార్య బిడ్డలకు తిండిపెడుతామన్న ఆశతో బయటదేశం వెళ్లిన ఆ రైతులు అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు. ఏజెంట్ మాటలు నమ్మి నాలుగు నెలలుగా ఇరాక్ లో అవస్థలు పడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ కు చెందిన ఏజెంట్ నరేందర్ పని ఇప్పిస్తానని నమ్మించి నాలుగు నెలల క్రితం నందిపేట , నవీపేట, సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన 15 మందిని విజిటింగ్ వీసాలపై ఇరాక్ పంపాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. కొన్నాళ్లు అక్కడ గుట్టుగా తలదాచుకున్న బాధితులకు తాత్కాలిక నివాస అనుమతి కల్పిస్తామంటూ మరో ఏజెంట్ 50వేల చొప్పున తీసుకుని మొహం చాటేశాడు. వీరంతా ప్రస్తుతం ఇర్బిల్ ప్రాంతంలో ఉంటూ తిండి లేక అలమటిస్తున్నారు.

అటు విజిటింగ్ వీసా గడువు ముగియడంతో ఇరాక్ అధికారులు జరిమానాలు విధించారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు 8వేల చొప్పున కావాలని అంతమొత్తం తమ వద్ద లేదని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. దుర్బర పరిస్థితుల్లో రోజులు గడుపుతున్నామని ఆదుకోండంటూ కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ కు వీడియోలో మొరపెట్టుకున్నారు. ఇళ్లకు ఫోన్ చేసి బాధను కళ్లకు కట్టడంతో వారి కుటుంబ సభ్యులు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మోసపోయిన తమ వారిని రప్పించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. మోసం చేసిన ఏజెంట్ ను అరెస్టు చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories