ష్‌.. తెలంగాణలో మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెర

ష్‌.. తెలంగాణలో మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెర
x
Highlights

మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనుంది. గత కొన్ని రోజులుగా హోరెత్తిన మైకులు ఇక మూగబోనున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సర్వం...

మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనుంది. గత కొన్ని రోజులుగా హోరెత్తిన మైకులు ఇక మూగబోనున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సర్వం సిద్దం చేస్తోంది ఎన్నికల కమిషన్. 16 పార్లమెంట్ స్థానల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటల్లో ముగియనుంది. పార్లమెంటు ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 వేల 604 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2లక్షల 80వేల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. 4వేల169 పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. 21వేల 360 పోలింగ్ స్టేషన్ లలో డిజిటల్ కెమెరాల ద్వారా అధికారులు పోలింగ్ పర్యవేక్షించనున్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 5,749 లుగా గుర్తించారు. ఇక్కడ సిసి కెమరాల ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పోలీస్ బందో బస్తూ ఏర్పాటు చేయనున్నారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మ్యదం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. 50వేల వరకు నగదు తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందన్నారు ఈసీ. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేస్తే, సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సీ విజిల్ ద్వారా ఇప్పటి వరకు 1430 కేసులు నమోదు అయితే, అందులో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 145 కేసులు నమోదు అయినట్లుగా ఈసీ తెలిపింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొత్తం 185 మంది అబ్యర్థులు పోటిలో ఉండటంతో ఇక్కడ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు.

నిజామాబాద్ మినహ, మిగతా 16 పార్లమెంట్ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ 185 మంది అభ్యర్థులు పోటిలో ఉండటంతో అభ్యర్థులకు, ఏజెంట్లకు అవగాహణ కొసం 7 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి 4 గంటలవరకే పోలింగ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories