సెంట్రల్ కేబినెట్‌లో తెలంగాణ బీజేపీ నుంచి ఎంత మందికి ఛాన్స్?

సెంట్రల్ కేబినెట్‌లో తెలంగాణ బీజేపీ నుంచి ఎంత మందికి ఛాన్స్?
x
Highlights

కేంద్ర మంత్రివర్గంలో స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ బీజేపీకి ఒక బెర్తు దక్కుతుందా? లేక దక్షిణాదిన దృష్టితో మరొకరికి అవకాశం పార్టీ ఇస్తుందా?...

కేంద్ర మంత్రివర్గంలో స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ బీజేపీకి ఒక బెర్తు దక్కుతుందా? లేక దక్షిణాదిన దృష్టితో మరొకరికి అవకాశం పార్టీ ఇస్తుందా? అనేది సస్పెన్స్‌‌గా మారింది. అయితే, ఇప్పటికే కిషన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సెంట్రల్ కేబినెట్‌లో బెర్త్ దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలు దక్కడంతో నలుగురిలోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. కేంద్ర మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుందని ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి రాంలాల్ నుంచి పిలుపు వచ్చింది. ఢీల్లీలో అందుబాటులో ఉండాలని పిలుపు రావడంతో కిషన్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని ఎంపీ కిషన్‌రెడ్డి చెప్పారు. కేబినెట్‌లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక రెండో బెర్త్ ఉంటుందా లేక ఉండదా అనే అంశం పార్టీలో క్లారిటీ లేదు. పార్టీ నేతలు మాత్రం పూర్తి ధీమాతో ఉన్నారు. దక్షిణాదిన పార్టీ బలపడాలంటే తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు ఉంటాయని చర్చ కూడా పార్టీలో ఉంది. అయితే రెండో మంత్రి పదవికి ధర్మపురి అర్వింద్ కి వస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. బండి సంజయ్‌కు సంఘ్ పరివార్ మూలాలు ఉండడంతో ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో బీజేపీ ఎంపీ సోయం బాబురావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఖచ్చితంగా ఎంత మంది చోటు లభిస్తుందనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories