విద్యార్థిని కాపలాపెట్టి.. మరో విద్యార్థిపై స్కూల్ టీచర్ లైంగికదాడి..

విద్యార్థిని కాపలాపెట్టి.. మరో విద్యార్థిపై స్కూల్ టీచర్ లైంగికదాడి..
x
Highlights

ఈ మధ్య లైంగిక దాడులు మరింత పెరిగిపోతున్నాయి. ఏకంగా బడికి వొచ్చిన విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యార్థుల భవిష్యత్తు చక్కదిద్దాల్పి బడి పంతులమ్మె...

ఈ మధ్య లైంగిక దాడులు మరింత పెరిగిపోతున్నాయి. ఏకంగా బడికి వొచ్చిన విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యార్థుల భవిష్యత్తు చక్కదిద్దాల్పి బడి పంతులమ్మె లైంగిక దాడికి పాల్పడింది. అరిజోనాలోని లిబర్టీ ఎలిమెంటరీ స్కూల్ చదువుకుంటున్న విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడింది బ్రిటనీ జమోరా(28) టిచర్. స్కూల్లో పదమూడేళ్ల బాలుడితో ఇంకో విద్యార్థి ఆడుకుంటున్నారు. అది చూసిన టీచర్ మీ ఇద్దరితో మాట్లాడాలి. వెంటనే క్లాస్‌రూమ్‌కు రండి అంటూ ఆ స్నేహితులిద్దరినీ పిలిచిందా టీచర్.అయితే తాము ఏదైనా తప్పు చేశామేమో అని తెగ భయపడుతూ టీచర్ వెంట వెళ్లారు విద్యార్థులు.

అయితే తరగతి గదిలోకి వెళ్లాక వారి భయాలన్నీ ఉట్టివేనని తేలిపోయాయి. వారిలో ఒకరిని తలుపు వద్ద కాపలా నిలబెట్టిన బ్రిటనీ జమోరా ఇంకో విద్యార్ధిపై అతి బలవంతంగా లైంగిక దాడి చేసింది. ఆ తర్వాత కూడా ఆ టీచర్, స్టూడెంట్ తమ వికృత సంబంధాన్ని కొనసాగించారు. అయితే వీరి ప్రవర్తన చూసిన మిగతా విద్యార్థులు వెంటనే స్నూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదులు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు లిబర్టీ ఎలిమెంటరీ స్కూల్ యాజమాన్యంపై కేసు వేశారు. ఇక విచారణ సందర్భంగా టీచర్ నేరం ఒప్పుకుని తనను క్షమించమంటూ తెగ ఏడ్చేసింది. ఆమెకు 30 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories