స్టూడెంట్ చేయి విరగొట్టిన టీచర్

స్టూడెంట్ చేయి విరగొట్టిన టీచర్
x
Highlights

పిల్లలను క్రమశిక్షతో ఉంచాల్సిన ఓ టీచర్ క్రమశిక్ష తప్పాడు చిన్న పిల్ల అని చూడకుండా, ఒళ్లు మర్చిపోయాడు, కోపంతో ఊగిపోయాడు విద్యార్థిని ఇష్టం వచ్చినట్లు...

పిల్లలను క్రమశిక్షతో ఉంచాల్సిన ఓ టీచర్ క్రమశిక్ష తప్పాడు చిన్న పిల్ల అని చూడకుండా, ఒళ్లు మర్చిపోయాడు, కోపంతో ఊగిపోయాడు విద్యార్థిని ఇష్టం వచ్చినట్లు చితక బాదాడు ఫలితంగా ఓ విద్యార్థిని చేయి విరిగింది ఈ ఘటన చిత్తూరు జిల్లా BN కండ్రిగ మండలం లోని చల్లమాంబ పురం లో చోటుచేసుకుంది.

చల్లమాంబపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంధ్య అనే విద్యార్థిని ఆరో తరగతి చదువుతోంది. చెప్పిన మాట సంధ్య వినక పోవడంతో ఉపాధ్యాయుడు రాజాకు ఆగ్రహం వచ్చింది దీంతో సంధ్యను చితక బాదడంతో ఆమె చెయ్యి విరిగింది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు పాఠశాలలోకి ప్రవేశించి రాజాను నిలదీశారు అనంతరం స్కూల్ ను మూసివేయించి అక్కడే ఆందోళనకు దిగారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు దండించాలి.. కానీ ఆ దండన కారణంగా వారి జీవితాన్ని నాశనం చేయకూడదు అంటున్నారు గ్రామస్థులు.

Show Full Article
Print Article
Next Story
More Stories