టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా కడప పోరు...మరి కడపలో వైసీపీకి తిరుగులేదా?

టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా కడప పోరు...మరి కడపలో వైసీపీకి తిరుగులేదా?
x
Highlights

అక్కడ వైఎస్‌ కుటుంబానిదే మాట. అభ్యర్థి ఎవరైనా వాళ్లు నిలబెట్టినారిదే గెలుపు బాట. సామాజిక సమీకణలు వడపోసి, 2014లో ఒక అభ్యర్థిని నిలబెట్టింది వైసీపీ....

అక్కడ వైఎస్‌ కుటుంబానిదే మాట. అభ్యర్థి ఎవరైనా వాళ్లు నిలబెట్టినారిదే గెలుపు బాట. సామాజిక సమీకణలు వడపోసి, 2014లో ఒక అభ్యర్థిని నిలబెట్టింది వైసీపీ. ఇప్పుడు కూడా అదే అభ్యర్థిని పోరులో నిలిపింది. అయితే, గతంలో వైసీపీ స్ట్రాటజీకి భిన్నంగా వెళ్లిన టీడీపీ, ఈసారి మాత్రం, తాను కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోయింది. ఇక్కడ గెలిచి, జగన్‌ నైతికస్థైర్థాన్ని దెబ్బతీయాలనుకుంది. ఇంతకీ కడప గడపలో టీడీపీ వ్యూహమేంటి బారులు తీరిన ఓటర్ల సాక్షిగా సైకిల్‌ వ్యూహం పారిందా? ఇద్దరు అభ్యర్థుల నేపథ్యమేంటి గెలుపుపై వారి దీమా ఏంటి?

కడప జిల్లాలో జిల్లా కేంద్రమైన కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీలు ప్రతి ఎన్నికల్లోను ప్రతిష్టాత్మకంగా పోటీ పడుతుంటాయి. కడప నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అంజద్‌ బాష తిరిగి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ అనేక తర్జనభర్జనలు, మార్పులుచేర్పుల తర్వాత తెలుగుదేశం కూడా ఈసారి మైనార్టీ అభ్యర్ధినే బరిలోకి దించింది. మొదట్లో మాజీ ఎమ్మెల్యే అహ్మదుల్లాకు లేదంటే, ఆయన తనయుడు ఆష్రఫ్‌కు టికెట్ ఖాయమని అందరూ భావించారు. వీరితో పాటు జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి పేరు వినపడింది. కానీ అకస్మాత్తుగా రాష్ర్ట టీడీపీ మైనార్టీ నాయకులు అమీర్ బాబును టీడీపీ రంగంలోకి దించింది. దీంతో తొలిసారి మైనార్టీ నేతల మధ్య రసవత్తర పోటీ నెలకొంది.

1952లో ఏర్పడ్డ కడప నియోజకవర్గం నుంచి మహామహులే పోటీ చేశారు. అయితే 1983లో ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత టీడీపీ కూడా పలుమార్లు గెలుపొందుతూ వచ్చింది. తెలుగుదేశంకు కడపలో పట్టు ఉన్నప్పటికీ, 2004 నుంచి వరుసగా ఓటమిపాలవుతూ వస్తోంది. 2014లో వైసీపీ అభ్యర్థిగా అంజద్‌ బాష, టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్‌పై పోటీ చేసి గెలిచారు. 1994 నుంచి కడప నియోజకవర్గంలో,

పార్టీ ఏదైనా మైనార్టీలే గెలుస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ మైనార్టీని బరిలో దించింది.ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నా ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కుటుంబ మద్దతు ఉన్న మద్దతుదారులే గెలుపొందుతున్నారు. ఈ కుటుంబ మద్దతుతోనే గత ఎన్నికల్లో కడప వైసీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన అంజాద్ బాష, భారీ మెజార్టీతోనే గెలుపొంది, ప్రస్తుత ఎన్నికల్లోను ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. అయితే అంజద్‌బాష అభివృద్ది పరంగా చెప్పుకోదగ్గ పనులు చేయలేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నందున, దాన్ని ప్రజలు పెద్దగా తప్పు పట్టే పరిస్థితి లేకపోయింది. దీనికితోడు సౌమ్యుడిగా పేరు

ఉండటంతో ప్రజల్లోను పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కావడం, ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతల ప్రకటనలతో అంజాద్ బాష గెలుపుపై వైసీపీ నమ్మకంగా ఉంది. దీనికితోడు అటు టీడీపీ అభ్యర్ధి ఎంపిక కూడా తనకు కలిసి వస్తుందన్న దీమా వైసీపీలో కనపడుతోంది. టీడీపీలో నాయకుల మధ్య ఉన్న అనైక్యత, వర్గపోరు తమకు మరింత బలానిస్తుందని వైసీపీ అభ్యర్థి అంటున్నారు.

ఇక టీడీపీ విషయానికొస్తే, కడపలో ఆ పార్టీకి మంచి క్యాడర్ ఉన్నా, ప్రతిసారి అభ్యర్ధి ఎంపికే పార్టీకి నష్టం కలిగిస్తోందన్న విమర్శలున్నాయి. గడచిన 20 యేళ్లుగా ఇతర పార్టీలు మైనార్టీలకు టికెట్లు ఇస్తే, టీడీపీ మాత్రం నాన్ మైనార్టీకి టికెట్ ఇచ్చింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం మైనార్టీలకు టికెట్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో మైనార్టీ అభ్యర్ధికే టికెట్ ఇచ్చింది. అయితే మైనార్టీ అభ్యర్ధికి టికెట్ ఇచ్చినా పార్టీలో అనైక్యత, వర్గపోరు కారణంగా పార్టీలోని వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచెయ్యలేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీసం ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకోలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక జనసేన సైతం బలమైన అభ్యర్ధినే పోటీలో నిలిపింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సుంకర శ్రీనివాస్‌ను కడప బరిలో దించింది. ఈయన కూడా విస్తుృతంగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ, టీడీపీలు మైనార్టీల ఓట్లపై ఆధారపడితే, ఈయన మాత్రం నాన్ మైనార్టీల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా ఎన్నికల్లో ముందుకెళ్లారు. మొత్తానికి త్రిముఖ పోటీగా కనిపిస్తున్నా, ప్రధానంగా టీడీపీ-వైసీపీ మధ్య పోరు ఉంది. ఇద్దరూ మైనార్టీ నాయకులనే బరిలోకి దించడంతో, గెలుపుపై ఎవరికివారు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories