Top
logo

కేసీఆర్ కు టీడీపీ లేఖ...మీ సామంత రాజును...

కేసీఆర్ కు టీడీపీ లేఖ...మీ సామంత రాజును...
X
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె.కళావెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. అవినీతిలో డైనోసార్ లాంటి...

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె.కళావెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. అవినీతిలో డైనోసార్ లాంటి జగన్‌ కుట్రలకు లోటస్ పాండ్ కేంద్రంగా మీరు మాస్టర్ ప్లాన్ అందిస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌ను నమ్మి ప్రజలు ఓటేస్తారని, రాష్ట్రంపై పెత్తనం మీకు వస్తుందని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. అందుకోసం వేల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొత్తును జగన్‌ కోసం పెట్టుబడిగా పెడుతున్నారని, టీఆర్‌ఎస్ భవన్‌లో స్విచ్ వేస్తేనే ఏపీలో ఫ్యాన్ తిరిగే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. మొత్తం 22 పాయింట్లతో కూడిన లేఖను ఇవాళ కేసీఆర్‌కు పంపారాయన. మీకూ, ఏపీ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికల్లో మీ సామంత రాజును చిత్తుగా ఓడించడానికి ఐదుకోట్ల మంది ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆ లేఖలో కళావెంకట్రావు పేర్కొన్నారు.

Next Story