హిందూపురంలో బాలయ్యకు ఈ సారి ఓటమి తప్పదట..!

హిందూపురంలో బాలయ్యకు ఈ సారి ఓటమి తప్పదట..!
x
Highlights

నటసింహం బాలకృష్ణకి ఈ సారి ఓటమి తప్పదా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు .. సినిమాలోనే ఉంటూ గత ఎన్నికల్లో ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చారు ...

నటసింహం బాలకృష్ణకి ఈ సారి ఓటమి తప్పదా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు .. సినిమాలోనే ఉంటూ గత ఎన్నికల్లో ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చారు బాలకృష్ణ. టిడిపికి కంచుకోటగా ఉన్నా హిందూపురం నుండే అయన పోటి చేసి గెలిచారు . కాని ఆయన ఈసారి వేరే నియోజకవర్గం నుండి పోటి చేస్తారన్న వార్తలు వినిపించాయి ..

అయితే బాలయ్య ఈ సారి కూడా హిందూపురం నుండే బరిలోకి దిగారు . గత ఎన్నికల్లో గెలిచినా అయన పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు .నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడం , ప్రజల సమస్యలను తీర్చడంలో బాలయ్య ఫెయిల్ అయ్యారని టాక్ నడిచింది కూడా .. దీనికి తోడు ప్రచారంలో భాగంగా ఆయన అభిమానులపైన మరియు పార్టీ కార్యకర్తల పైన ఆయన చేయి జేసుకోవడం కూడా అయనని గెలుపు నుండి దూరం చేసే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ..

అయితే తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి .. అయితే ఎగ్జిట్ పోల్స్ తెదేపా పార్టీకి పెద్ద షాక్ నే ఇచ్చాయి.. తెదేపా ఓడిపోయే స్థానాల్లో హిందూపురం కూడా ఒకటి అన్న చర్చ నడుస్తుంది . ఈ సారి బాలకృష్ణకి పోటి ఇచ్చేందుకు బరిలో ఉన్న వైసీపీ అభ్యర్ది ఇక్బాల్ అహ్మద్ ఖాన్ గెలిచే అవకశాలు ఉన్నట్లు తెలుస్తుంది .. దీనిపైన ఓ పూర్తి స్పష్టత రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories