ఏపీలో పొలిటికల్ హీట్...మోడీ టూర్ పై సెగలు

ఏపీలో పొలిటికల్ హీట్...మోడీ టూర్ పై సెగలు
x
Highlights

ప్రధాన మంత్రి మోడీ గుంటూరు పర్యటన ఆసక్తి రేపుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడి పర్యటనపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. మోడీ...

ప్రధాన మంత్రి మోడీ గుంటూరు పర్యటన ఆసక్తి రేపుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడి పర్యటనపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. మోడీ పర్యటనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని టీడీపీ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ సొంత గడ్డ గుంటూరుకు తొలి సారి మోడీ వస్తుండటంతో తన సత్తా చాటాలని కన్నా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఓ వైపు కేంద్ర అధికార పార్టీ - మరో వైపు రాష్ట్ర అధికార పార్టీ లు రంగం లోకి దిగడంతో అందరి దృష్టి మోడి పర్యటన పైనే ఉంది. బీజేపీ - టీడీపీ రగడలతో మోడీ పర్యటన ఉత్కంఠతకు దారి తీస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 10 న తేదిన గుంటూరు, 21 న వైజాగ్ ల లో మోడీ పర్యటించనున్నారు. 10 తేదిన గుంటూరు నగర శివారు లో ఏర్పాటు చేసిన బహిరంగసభ లో మోడీ పాల్గోనున్నారు. తొలుత బిపిసిఎల్, ఓఎన్జీసి కంపెనీ శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం జరిగే పార్టీ బహిరంగ సభలో మోడీ పాల్గోని ప్రసంగిస్తారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు శివారు లోని బుడంపాడు కు చేరుకుంటారు. మొత్తం గంటన్నర సేపు మోడీ గుంటూరులో గడపనున్నారు.

మోడీ పాల్గోనే సభకు ప్రజా చైతన్య సభ - సత్యమేవ జయతే గా నామకరణం చేశారు. సభ ప్రాంగణానికి దివంగత ప్రధాని వాజపేయి ప్రాంగణంగా నామకరణం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ సొంత గడ్డ గుంటూరులో మోడీ పర్యటనకు వస్తున్న నేపధ్యంలో సభను విజయవంతం చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సభ ప్రాంగణంలో దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ సభ ద్వారా కేంద్రం ఏపీ అభివృద్ధికి చేసిన సాయం గురించి వివరిస్తారని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ చెప్పారు.

మరో వైపు రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న మోడీ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్దాయి లో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నెల 10 తేదిన రాష్ట్ర వ్యాప్తంగా మోడీ పర్యటన కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన లు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. మరో వైపు ప్రత్యేక హోదా సాధన సమితి తో పాటు పలు ప్రజా సంఘాలు మోడీ పర్యటన ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే మోడీ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సి లు కూడా ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అదికారంలో వున్న టీడీపీ మోడీ సభను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని పార్టీ సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా రంగంలోకి దిగి సభకు వాహనాలు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు . మోడీ సభను అడ్డుకోమని చంద్రబాబు బహిరంగంగా ఇచ్చిన పిలుపును ఎంత వరకు సంప్రదాయమో అర్దం చేసుకోవాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. టీడీపీతో పలు ప్రజా సంఘాల నిరసనల మధ్య ప్రధాని మోడీ గుంటూరు పర్యటన ఎలా సాగుతుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories