logo

9 మంది టీడీపీ రెబల్స్ సస్పెండ్

9 మంది టీడీపీ రెబల్స్ సస్పెండ్

ఏపీలో ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుండి రెబల్స్‌గా ఎన్నికల పోటీ చేసిన తొమ్మిది మంది టీడీపీ అదిష్ఠానం సస్పెండ్ చేసింది. టీడీపీలో టిక్కెట్ దొరకపోవడంతో 9 మంది రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక దీంతో ఈ తొమ్మిది మందిని సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

రంపచోడవరం - కేపీఆర్‌కే ఫణిశ్వరీ

గజపతి నగరం - కే. శ్రీనివాస్ రావు

ఆవనిగడ్డ - కంఠమనేని రవి శంకర్

తంబళ్లపల్లె - ఎం. మాధవరెడ్డి

మదనపల్లె - బొమ్మనచెరువు శ్రీరాములు

బద్వేలు - ఎన్. విజయ జ్యోతి

కడప - ఎ. రాజగోపాల్ రెడ్డి

తాడికొండ - సర్వ శ్రీనివాస్ రావు

తంబళ్లపల్లె - ఎన్. విశ్వనాథ రెడ్డి

లైవ్ టీవి

Share it
Top