Top
logo

లోకేశ్వర్‌ రెడ్డి అరెస్ట్‌కు ఏపీ పోలీసుల యత్నం!

లోకేశ్వర్‌ రెడ్డి అరెస్ట్‌కు ఏపీ పోలీసుల యత్నం!
X
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న డేటా వార్‌ మరింత ముదురుతోంది. ఐటీ గ్రిడ్‌ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌...

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న డేటా వార్‌ మరింత ముదురుతోంది. ఐటీ గ్రిడ్‌ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. కూకట్‌పల్లిలోని ఇందూ ఫార్చ్యూన్‌ విల్లాస్‌కు చేరుకున్న ఏపీ పోలీసులు లోకేశ్వర్‌ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన తెలంగాణ పోలీసులు లోకేష్‌రెడ్డిని సైబరాబాద్‌ సీపీ కార్యాలయానికి తరలించారు. దీంతో విచారణ ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులుగా మారింది. ఇటు ఐటీ గ్రిడ్‌ సంస్థ డైరెక్టర్‌ అశోక్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. తమ సంస్థలోని నలుగురు ఉద్యోగులు భాస్కర్‌, ఫణి, చంద్రశేఖర్‌, విక్రమ్‌ గౌడ్‌ కనిపించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

Next Story