Top
logo

కేసీఆర్‌ ప్రచారం చేస్తే టీడీపీకి 160 సీట్లు ఖాయం

కేసీఆర్‌ ప్రచారం చేస్తే టీడీపీకి 160 సీట్లు ఖాయం
X
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలందరూ నమ్మకం కోల్పోయారని ఎంపీ కేశినేని నాని అన్నారు. బుధవారం కేశినేని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలందరూ నమ్మకం కోల్పోయారని ఎంపీ కేశినేని నాని అన్నారు. బుధవారం కేశినేని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్, అనుకూల ప్రంట్ మాత్రమే ఉంటాయని కేశినేని నాని స్పష్టం చేశారు. అసలు ఈ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డితో జరిపిన చర్చలు నిష్పయోజనమన్నారు. ఎన్ని కుట్రలు చేసిన కాని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు రావడం మాత్రం ఖచ్చితమని కేశినేని నాని ధీమావ్యక్తం చేశారు. అయితే వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తరుపున తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే మాత్రం టీడీపీకీ 160సీట్లు వస్తాయని అన్నారు. ఇక జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీకి 130 సీట్ల కంటే ఎక్కువ రావని కేశినేని నాని అన్నారు. అసలు ఈ ఫెడరల్ ఫ్రంట్ భారత ప్రధాని మోడీకి మద్దతు ఇచ్చేందుకే కేసీఆర్ ఫెఢరల్ ఫ్రంట్ అని కేశినేని నాని మండిపడ్డారు.

Next Story