Top
logo

కారెక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే..?

కారెక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే..?
Highlights

సత్తుపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మూడుసార్లు గెలిచిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా.?

సత్తుపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మూడుసార్లు గెలిచిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా.? అందుకే ఆయన ఇవాళ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయలేదా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీ సమావేశల తొలి రోజున ఐదుగురు తప్ప అందరూ ప్రమాణం చేశారు. ఆ ఐదుగురిలో సండ్ర వెంకట వీరయ్య కూడా ఉన్నారు. అయితే ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం, పార్టీ మారే యోచనే అని సండ్ర అనుచర వర్గమే ప్రచారం చేస్తోంది. సండ్ర టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాతే ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ తరుపున గెలిచిన సండ్రతో పటు మరో టీడీపీ ఎమ్మెల్యేను కూడా కారెక్కించే బాధ్యతను టీఆర్ఎస్ హైకమాండ్ ఓ ప్రముఖ నేత కు అప్పగించినట్లు తెలుస్తోంది.


లైవ్ టీవి


Share it
Top