మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ..

MLA Bode Prasad
x
MLA Bode Prasad
Highlights

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, సబ్ కలెక్టర్ మిషా సింగ్ మధ్య వివాదం రాజుకుంది. వణుకూరు గ్రామ పరిధిలోని పుల్లేరులో కొందరు ప్రభుత్వ అనుమతి లేకుండా యంత్రాలతో మట్టిన తవ్వడం చెట్లు నరకడం వివాదాస్పదమైంది.

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, సబ్ కలెక్టర్ మిషా సింగ్ మధ్య వివాదం రాజుకుంది. వణుకూరు గ్రామ పరిధిలోని పుల్లేరులో కొందరు ప్రభుత్వ అనుమతి లేకుండా యంత్రాలతో మట్టిన తవ్వడం చెట్లు నరకడం వివాదాస్పదమైంది. ఇది చినికి చినికి ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ మధ్య తీవ్రవాగ్వాదానికి దారి తీసింది. మట్టితవ్వకం వ్యవహారం సీఎం పేషికీ చేరింది.

కృష్ణా జిల్లాలో వణుకూరు-ఈడుపుగల్లు గ్రామాల మధ్య ఉన్న పుల్లేరు వాగులో కొందరు యంత్రాలతో చెట్లు తొలగించి మట్టిని తవ్వి ప్రభుత్వ పోరంబోకు స్థలంలో పోస్తున్నారు. చుట్టుపక్కల పొలాలను ప్లాట్లుగా మార్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పుల్లేరువాగు ఆక్రమణలకు శ్రీకారం చుట్టారంటూ వణుకూరుకు చెందిన కొందరు పెనమలూరు తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు పుల్లోరులో మట్టితవ్వకం పనులు చేస్తున్న యంత్రాలు సీజ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో అన్యాక్రాంతం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోబడును అంటూ బోర్డును ఏర్పాటు చేశారు.

ఇదే విషయాన్ని పుల్లేరులో మట్టి తవ్వకం పనులు చేయిస్తున్న వ్యక్తులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ దృష్టికి తీసుకువెళ్లారు. పుల్లేరువాగులో మట్టితవ్వుతున్న ప్రదేశాన్ని సందర్శించారు బోడె ప్రసాద్. రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసిన యంత్రాలను తన కార్యాలయానికి తరలించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన యంత్రాన్ని ఎందుకు తీసుకువచ్చారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్.

వివాదం కాస్తా ముదరడంతో అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో మట్టి తవ్వుతున్నందుకు వాల్టా చట్టం ప్రకారం కేసు పెడతామని సబ్‌కలెక్టరు హెచ్చరించారు. ఎమ్మెల్యే, సబ్‌కలెక్టరు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. సబ్‌కలెక్టరు తీరుతో అసహనానికి గురయ్యారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌. రైతు పొలం గట్టును పటిష్టం చేసుకునేందుకు కూడా అనుమతి తీసుకోవాలనడం, కేసులు పెడతామనడం న్యాయమేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్. మొత్తం వివాదాన్ని సీఎం చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories