బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. వయా టీడీపీ

X
Highlights
కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కడపలోని కందుల ఎస్టేట్‌లో బీజేపీ రాష్ట్ర...
Chandram17 March 2019 3:24 AM GMT
కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కడపలోని కందుల ఎస్టేట్‌లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో జయరాములు వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి విజయజ్యోతిపై గెలుపొందారు. అనంతరం, ఆయన టీడీపీలో చేరారు. ప్రస్తుతం బద్వేలు స్థానాన్ని జయరాములు, విజయజ్యోతి ఇద్దరూ ఆశించారు. అయితే, వీరిద్దరికీ కాకుండా పార్టీ అధిష్ఠానం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సూచన మేరకు డాక్టర్ రాజశేఖర్‌కు టికెట్ ఖరారు చేసింది. దీంతో జయరాములు బీజేపీలో చేరారు. వెనుకబడిన తన నియోజకవర్గం గురించి ఎన్నిసార్లు అసెంబ్లీలో చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. కనీసం వ్యక్తికి విలువ కూడా టీడీపీలో దక్కలేదన్నారు. బలమైన నాయకత్వం ఉన్న బీజేపీతోనే దేశానికి మేలు జరుగుతుందని జయరాములు అన్నారు.
Next Story