logo

టీడీపీకి షాక్‌.. కొత్త పార్టీ యోచనలో మాజీ ఎమ్మెల్యే..!

టీడీపీకి షాక్‌.. కొత్త పార్టీ యోచనలో మాజీ ఎమ్మెల్యే..!

ఏపీలో ఎన్నికల వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్స్ మీద షాక్స్ తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే టీడీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో జంప్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. అయితే గత కొంత కాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఎన్నికల్లో పార్టీ వీడి మరో పార్టీలోకి జంప్ అవుతారని జోరుగా ప్రచారం సాగినా విషయం తెలిసిందే కాగా అయితే విద్యారంగంలో సంస్కరణలు తెచ్చే పార్టీకే తన పూర్తి మద్దతు ఉంటుందని ఈదర హరిబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు మరో రెండ్రోజుల్లోనే ప్రజాభిప్రాయం తీసుకుంటానని హరిబాబు వెల్లడించారు. ఈ ఎన్నికల అనంతరం కొత్త పార్టీయే పెడతానని ఈదర హరిబాబు ఈ సందర్బంగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దిగుతనని ప్రజా ఉద్యమంలోకి వెళ్తానని హరిబాబు తెలిపారు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో తనకు చాలా అవమానాలు జరిగాయని హరిబాబు వాపోయారు. పొన్నలూరు నుంచి టీడీపీ జడ్పీటీసీగా గెలుపొందిన ఈదర హరిబాబు టీడీపీ పార్టీ నుండి జడ్పీటీసీగా గెలిచిన హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా చైర్మన్‌ పోటీలోకి దిగి కేవలం ఒక్క ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై గెలుపొందారు.

లైవ్ టీవి

Share it
Top