logo

జగన్ కుట్ర రాజకీయాలు మానుకోవాలి

జగన్ కుట్ర రాజకీయాలు మానుకోవాలి

ఎస్సీలకు, తనకు మధ్య అగాధం సృష్టించాలని వైఎస్ జగన్ చూస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. జగన్ కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. గతంలో తన ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియోలో ఎస్సీలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని, తన మాటలను వక్రీకరించారని స్పష్టం చేశారు. ఎస్సీలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్నారు.


లైవ్ టీవి

Share it
Top