మహానాడు లేదు..జయంతి వేడుకలే

మహానాడు లేదు..జయంతి వేడుకలే
x
Highlights

మహానాడు తెలుగు తమ్ముళ్లు పెద్ద పండుగ. అటువంటిది ఈ సారి మహానాడు నిర్వహణ పై ఒక క్లారిటీ వచ్చింది. కౌంటింగ్‌కి మహానాడుకు మధ్య కేవలం 3,4 రోజుల వ్యవధి...

మహానాడు తెలుగు తమ్ముళ్లు పెద్ద పండుగ. అటువంటిది ఈ సారి మహానాడు నిర్వహణ పై ఒక క్లారిటీ వచ్చింది. కౌంటింగ్‌కి మహానాడుకు మధ్య కేవలం 3,4 రోజుల వ్యవధి ఉండటంతో ఈ సారి కేవలం ఎన్టీఆర్ జయంతి వేడుకలు మాత్రమే అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు సూచించాయి. క్యాబినెట్ భేటీ సందర్భంగా అమరావతికి వచ్చిన నేతలతో మహనాడుపై చంద్రబాబు చర్చించారు. ఎక్కువ మంది మహానాడు నిర్వహణకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో నిర్వహించకపోవటం మంచిదనే సలహా ఇచ్చారు. దీనితో పార్టీ నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఎన్టీఆర్ జయంతి రోజు అన్ని ప్రాంతాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ స్థాయిలో జరిగే వరుస సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండటంతో పాటు సమయాభావం, చంద్రబాబు బిజీ షెడ్యూల్ దృష్టిలో పెట్టుకుని మహానాడు నిర్వహణ కష్టసాధ్యం అని టీడీపీ శ్రేణులు భావించాయి. మహానాడు స్థానంలో ఎన్టీయార్ జయంతి వేడుకలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

మహానాడు రద్దు కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా నిర్వహించని రోజులు ఉన్నాయి. 1985, 1991, 1996 సంవత్సరాల్లో కూడా మహానాడు నిర్వహించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories