ఏపీలో ఐటీ దాడులపై టీడీపీ నిరసన బాట

ఏపీలో ఐటీ దాడులపై టీడీపీ నిరసన బాట
x
Highlights

ఏపీలో టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని జరుగుతున్న ఐటీ , పోలీసు దాడులపై ఆ పార్టీ నేతలు నిరసనలు తెలపాలని నిర్ఱయించారు. కేంద్ర వ్యవస్థల్ని దుర్వినియోగం...

ఏపీలో టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని జరుగుతున్న ఐటీ , పోలీసు దాడులపై ఆ పార్టీ నేతలు నిరసనలు తెలపాలని నిర్ఱయించారు. కేంద్ర వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కాసేపట్లో ఆందోళనలు చేయబోతున్నారు. ఈ ఆందోళనల్లో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జరిగే ఆందోళనలో చంద్రబాబు పాల్గొంటారు. ఏపీపై కేంద్రం కుట్రలు, ఐటీ దాడులపై తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహం వేదికగా చంద్రబాబు నిరసన తెలియచేస్తారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీని దెబ్బతీసేందుకు కేంద్రం పావులు కదుపుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా బలవంతులైన అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ఐటీ దాడులకు తెగబడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరో ఐదు రోజులలో పోలింగ్ జరగనుండగా కేంద్రం మరెంలాంటి కుట్రలు పన్నుతుందోనన్న ఆందోళన టీడీపీ నేతలు, అభ్యర్థుల్లో మొదలైంది. వరుసగా జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, కేంద్రం తీరును నిరశిస్తూ చంద్రబాబు ఆందోళనలకు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories