వైసీపీలోకి కొనసాగుతోన్న వలసలు...కాసేపట్లో...

X
Highlights
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల్లో జంపింగ్స్ ఎక్కువయ్యాయి. ఇవాళ కొందరు ముఖ్య నేతలు వైసీపీ తీర్థం...
Arun Chilukuri9 March 2019 3:30 AM GMT
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల్లో జంపింగ్స్ ఎక్కువయ్యాయి. ఇవాళ కొందరు ముఖ్య నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఈ ఉదయం వైసీపీలో చేరుతున్నారు. అలాగే మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు కూడా జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరతారు. గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు కొంతకాలం తర్వాత జగన్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. చివరికి మరోసారి కుమారుడు రత్నాకర్‌తోపాటు అదే పార్టీలో చేరుతున్నారు. ఇక APSIDCమాజీ ఛైర్మన్ కె. నల్లపరెడ్డి కూడా ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు.
Next Story