శ్రీలంక పేలుళ్లు: తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత..

శ్రీలంక పేలుళ్లు: తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత..
x
Highlights

శ్రీలంకలోని కొలంబో ఉగ్రదాడి నుంచి అనంతపురం జిల్లా వాసులు త్రుటిలో తప్పించుకున్నారు. స్వల్పగాయాలతో బయటపడిన వీరంతా క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారు....

శ్రీలంకలోని కొలంబో ఉగ్రదాడి నుంచి అనంతపురం జిల్లా వాసులు త్రుటిలో తప్పించుకున్నారు. స్వల్పగాయాలతో బయటపడిన వీరంతా క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. భారత రాయబార కార్యాలయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కలెక్టర్ వీరపాండియాన్ వెంటనే స్పందించారని అక్కడి సిబ్బంది సేవలు బాగున్నాయని సురేంద్రబాబు ప్రశంసించారు.

అనంతపురం జిల్లాకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత, టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబుతో పాటు ఆ కంపెనీలో భాగస్వాములైన ఎం.రాజగోపాల్‌, దేవినేని వెంకటేశ్‌, కోన మహీధర్‌రెడ్డి, ప్రవాసాంధ్రుడైన బల్లా భక్తవత్సల నాయుడు ఈ నెల 19న విహారయాత్ర కోసం శ్రీలంక వెళ్లారు. షాంగ్రిలా హోటల్లో దిగారు. శ్రీలంక బాంబు బ్లాస్ట్ నుంచి వీరంతా తృటిలో తప్పించుకున్నారు. క్షేమంగా అనంతపురం చేరుకున్నారు. అంత పెద్ద బ్లాస్ట్‌ జరిగిన తర్వాత కూడా ప్రాణాలతో బయటపడడం అనేది ఓ మిరాకల్ అని సురేంద్రబాబు అన్నారు.

పేలుడు ధాటికి గాజుముక్కలు ఆ ప్రాంతంలోని పలువురిని గాయపరిచాయి. సురేంద్రబాబు ముక్కుకు, భక్తవత్సల నాయుడు తొడకు గాజుముక్కలు గుచ్చుకున్నాయి. బాంబు పేలుడు జరిగిన ప్రదేశానికి, సురేంద్రబాబు బృందం కూర్చున్న టేబుల్‌కు మధ్యలో ఓ స్తంభం అడ్డుగా ఉండటంతో వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. పేలుళ్ల నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ విధించడం, విమానాలను రద్దు చేయడంతో ఈ బృందం అదే హోటల్‌లో ఉండిపోయింది. భారత రాయబార కార్యాలయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కలెక్టర్ వీరపాండియాన్ వెంటనే స్పందించారని వారి కారణంగానే స్వదేశానికి ఇంత త్వరగా చేరుకోగలిగామని సురేంద్రబాబు బృందం చెబుతోంది.





Show Full Article
Print Article
Next Story
More Stories