అమెరికా గల్లీల్లో చంద్రబాబు షికార్లు..

అమెరికా గల్లీల్లో చంద్రబాబు షికార్లు..
x
Highlights

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. మిన్నెసోట రాష్ట్రంలో మేయో క్లినిక్‌లో వైద్యం పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. మిన్నెసోట రాష్ట్రంలో మేయో క్లినిక్‌లో వైద్యం పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన వైద్యుల నుంచి విలువైన సూచనలు తీసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని.. ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్‌ కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరితో పాటు పలువురు ఎన్నారైలు చంద్రబాబు నాయుడ్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఎప్పుడూ రాజకీయాలతో ఫుల్ బిజీగా బిజీగా ఉండే తమ అధినేతను ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈసందర్భంగా వారితో కలిసి నడుస్తూ అమెరికా వీధుల్లో తెగ సందడి చేశారు బాబు. ఇక వారితో కలిసి గల్లీ గల్లీ నడుస్తూ.. పాప్ కర్న్ తింటూ సరదాగా గడిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అమెరికాలో బాబు కూల్ కూల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అమెరికా పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్‌కు రానున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories