టీడీపీకి ఎమ్మెల్యే అభ్యర్ధి రాజీనామా

టీడీపీకి ఎమ్మెల్యే అభ్యర్ధి రాజీనామా
x
Highlights

ఇటివల ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించి 151 చోట్ల విజయం సాధించి...

ఇటివల ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించి 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. టీడీపీకి కేవలం 23 స్థానాలకు పరిమితం కాగా జనసేన ఒకే ఒక నియోజకవర్గంలో విజయం సాధించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో రాజీనామాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే టీడిపీకీ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి 2019ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆనగంటి హరికృష్ణ టీడీపీకి రాజీనామా చేశారు. అలాగే మరో టీడీపీ నేత బండి ఆనందరెడ్డి కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు బండి ఆనందరెడ్డి తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 59.67శాతం ఓట్ షేర్‌తో లక్షా 3వేల 38ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్ధి కే.నారాయణ స్వామి ఆనగంటి హరికృష్ణ పై 45వేల 594ఓట్ల తేడాతో గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories