Top
logo

జీహెచ్‌ఎంసీ vs నందమూరి హీరో

జీహెచ్‌ఎంసీ vs నందమూరి హీరో
X
Highlights

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కబరా...

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కబరా డ్రైవ్ ఇన్‌ రెస్టారెంట్‌ను కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు రావడంతో రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. తన రెస్టారెంట్ కూల్చేస్తున్నట్టు తెలుసుకున్న సినీనటుడు నందమూరి తారకరత్న అక్కడి చేరుకున్నారు. రాత్రి వేళల్లో మద్యం, సౌండ్స్‌తో న్యూసెన్స్ చేస్తున్నారని జీహెచ్‌ఎంసీకి సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు రెస్టారెంట్‌ను కూల్చేందుకు సిద్ధమయ్యారు.

Next Story