తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష
x
Highlights

తమిళనాడు మంత్రి బాలకృష్ణరెడ్డికి ముచ్చటగా మూడేళ్లు జైలు శిక్ష పడింది.

తమిళనాడు మంత్రి బాలకృష్ణరెడ్డికి ముచ్చటగా మూడేళ్లు జైలు శిక్ష పడింది. 1998లో హోసూర్ లో బస్సుపై రాళ్లదాడికి ఒడిగట్టిన కేసులో తమిళనాడు మంత్రి బాలకృష్ణ శిక్ష విధిస్తూ ప్రత్యేకన్యాయస్థానం నేడు (సోమవారం) తీర్పును వెల్లడించింది. కాగా ప్రభుత్వ ఆస్తుల తీవ్రనష్టం కలిగించినందుకు న్యాయస్థానం బాలకృష్ణ రెడ్గికి శిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రాళ్లదాడికి సంబంధించిన కేసులో మొత్తం 108మంది నిందితులు ఉండగా వారిలో 16 మందిని ప్రత్యేకన్యాయస్థానం దోషులుగా తెల్చింది. ఇక తీర్పుతో తమిళనాడు మంత్రి బాలకృష్ణరెడ్డి శాసనసభ్యుడి, మంత్రి పదవి కూడా కోల్పోనున్నారు. అయితే ఈ తీర్పుపై బాలకృష్ణరెడ్డి రేపు (మంగళవారం) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories