తల్లేమో కలెక్టర్‌.. కూతురేమో అంగన్‌వాడిలో

Collector
x
Collector
Highlights

పిల్లల జీవితం బాగుండాలని, వారి భవిష్యత్తుకు పునాది వేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఖర్చు ఎక్కువైనప్పటికీ కార్పోరేట్ స్కూళ్లలోనే చేరుస్తారు. చాలామంది అప్పుచేసైనా సరే ప్రైవేట్ స్కూళ్లలోనే చదివిస్తారు.

పిల్లల జీవితం బాగుండాలని, వారి భవిష్యత్తుకు పునాది వేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఖర్చు ఎక్కువైనప్పటికీ కార్పోరేట్ స్కూళ్లలోనే చేరుస్తారు. చాలామంది అప్పుచేసైనా సరే ప్రైవేట్ స్కూళ్లలోనే చదివిస్తారు. ఇక కలెక్టర్‌లు, పోలీస్ వంటి ప్రభుత్వ అధికారులైతే ఏకంగా ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదవిస్తుంటారు. కానీ ఓ కలెక్టర్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. పేద చిన్నారులు వెళ్లే అంగన్‌వాడి కేంద్రానికి తమ కూతురిని పంపించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

శిల్పా ప్రభాకర్ సతీష్..2009 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన కుమార్తెను అందరిలానే ప్రైవేట్‌ ప్లే స్కూల్‌కు పంపించకుండా తన ఇంటికి సమీపంలోని అంగన్‌వాడి కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ.. 'నా కూతురు నలుగురితో కలిసిమెలసి ఉండాలని భావిస్తున్నాను. ఈ ఆర్థిక, సామాజిక బేధాలు తనపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ చేర్చాను. ఇవేకాక తాను చాలా త్వరగా తమిళం నేర్చుకోవాలని భావించి ఇక్కడకు పంపుతున్నాను' అన్నారు. నర్సరీ స్కూళ్లలో మాదిరే అక్కడా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలను ఆడిస్తారు, చదివిస్తారు. అంగన్‌వాడి సెంటర్లను మరింత అభివృద్ధి చేయాలి' అని శిల్ప చెబుతున్నారు. ఆమె నిర్ణయాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories