ఏటీఎంలోకి పాము, వీడియో వైరల్‌

ఏటీఎంలోకి పాము, వీడియో వైరల్‌
x
Highlights

ఏటీఎంలోకి ప్రవేశించిన ఓ పాము కలకలం సృష్టించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల థనేర్‌పండల్‌ రోడ్‌లో చోటుచేసుకుంది. థనీర్‌ర్‌పండల్‌ రోడ్‌లోని...

ఏటీఎంలోకి ప్రవేశించిన ఓ పాము కలకలం సృష్టించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల థనేర్‌పండల్‌ రోడ్‌లో చోటుచేసుకుంది. థనీర్‌ర్‌పండల్‌ రోడ్‌లోని ఏడీబీఐ బ్యాంక్‌ ఏటీఎం మిషన్‌ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఓ కస‍్టమర్‌ పాము ఉండటాన్ని గమనించి వెంటన అలారాన్ని మోగించాడు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్‌ దృష్టికి తీసుకు వెళ్లగా పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. సదరు వ్యక్తి వచ్చి ఆ ఏటీఎంను తెరచి పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories