logo

తాలిబన్ల దాడిలో 20 మంది మృతి

తాలిబన్ల దాడిలో 20 మంది మృతి
Highlights

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయి విధ్వంసమే సృష్టంచారు. తాలిబన్లు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన...

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయి విధ్వంసమే సృష్టంచారు. తాలిబన్లు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో మొత్తం 20 మంది ప్రాణాలు విడిచారు. పశ్చిమ బాద్గీస్‌లోని మలాల్‌ ముర్గాబ్‌లో ఉన్న సర్కార్ కార్యాలయంలో తాలిబన్లు కాల్పులకు ఒడిగట్టరని అప్ఘాన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా చనిపోయిన వారిలో సైనికులు, పోలీసులు ఉండగా కాల్పుల్లో కొంతమంది భద్రతా బలగాలకు తీవ్ర గాయాలయ్యాయని ప్రొవిన్షియల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ నసీర్ తెలిపారు. కాగా తామే ఈ దాడికి పాల్పడ్డామని తాలిబన్ అధికార ప్రతినిధి ఖారీ యూసఫ్ అహ్మదీ ఓ ప్రకటన విడుదల చేశాడు.

లైవ్ టీవి

Share it
Top