Top
logo

బాబుకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేస్తాం : తలసాని

Talasani Srinivas YadavTalasani Srinivas Yadav
Highlights

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బెజవాడ దుర్గమ్మను తలసాని దర్శించుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బెజవాడ దుర్గమ్మను తలసాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. చం‍ద్రబాబు నాయుడు ప్రచారానికి పరిమితమైన నాయకుడని విమర్శించారు. ప్రజల సొమ్ముతో ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన వాస్తవాలను దాచలేమన్నారు. టీఆర్‌ఎస్‌ కాదు, ఏపీ ప్రజలే చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.


లైవ్ టీవి


Share it
Top