logo

40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ?

40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ?

ఏపీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబు, లోకేశ్ ఏపీ ప్రజల డేటా చోరీ చేసి అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. నీతిమాలిన పనులు చేసి సత్యహరిచంద్రుడినంటావా అని మండిపడ్డారు. నీతి, నిజాయితీ గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కుళ్లు రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనన్న ఆయన ఇందులో ఏపీ ప్రజలను లాగుతున్నారన్నారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో జరిగిందేంటి..? చంద్రబాబు చెబుతున్న దేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే దొంగతనం చేసి పక్కవాళ్లను దొంగాదొంగా అన్నట్లు చంద్రబాబు తీరుందని తలసాని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా బాబూ అని ప్రశ్నించారు. నాలుగేళ్లు ఉన్న చంద్రబాబు మనవడి పేరు మీద వేల కోట్ల రూపాయలు చూపించిన చరిత్ర చంద్రబాబు ఒక్కడికే దక్కుతుందని చెప్పుకొచ్చారు.

లైవ్ టీవి

Share it
Top