రిగ్గింగ్ ఆరోపణలపై ఈసీ సీరియస్

రిగ్గింగ్ ఆరోపణలపై ఈసీ సీరియస్
x
Highlights

సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్ అయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేస్తానని సవాల్ విసిరిన సయ్యద్ సుజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్ అయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేస్తానని సవాల్ విసిరిన సయ్యద్ సుజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సయ్యద్ లండన్‌లో చేసిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరింది.

ప్రస్తుతం భారత దేశ రాజకీయాలు సయ్యద్ సుజా చుట్టే తిరుగుతున్నాయి. ఈవీఎంలకు సులభంగా హ్యాక్ చేయవచ్చని గత లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే బీజేపీ గెలిచిందని సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజకీయాలను షేక్ చేస్తున్న ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఈవీఎంలపై అసత్యప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సయ్యద్ షుజాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులకు ఈసీ ఫిర్యాదు చేసింది.

సుజా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, తగిన దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు ఈసీ లేఖ రాసింది. ఈ ఆరోపణలు మీడియా ద్వారా తెలిశాయని, తాను ఈవీఎం డిజైన్ టీమ్‌ సభ్యుడినని సయ్యద్ సుజ చెప్తున్నారని ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఈసీ పేర్కొంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అసాధ్యమని మరోసారి ఈసీ స్పష్టం చేసింది. సయ్యద్ కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించింది. ఈవీఎంలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ లలో తయారు చేస్తారని ఈసీ తెలిపింది. అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించి, అన్ని ప్రామాణిక ప్రక్రియలను పరిశీలిస్తూ వీటిని తయారు చేస్తారని వివరించింది.

వీటిని పరిశీలించడానికి 2010లోనే ఓ అత్యున్నత సాంకేతిక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశాం అని ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో ఈసీ వెల్లడించింది. ఈ ఆరోపణలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చో చెప్పాలని ఢిల్లీ పోలీసులను ఈసీ కోరింది.

కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీడీపీ సహా పలు విపక్ష పార్టీలు సయ్యద్ సుజా ఆరోపణలను సమర్థించాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories