logo

జగన్‌ చేసేదే చెబుతాడు : ఎస్వీ కృష్ణారెడ్డి

జగన్‌ చేసేదే చెబుతాడు : ఎస్వీ కృష్ణారెడ్డి

జగన్ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలని చూస్తున్నారన్నారు డైరెక్టర్ ఎస్.వి. కృష్ణారెడ్డి. జగన్ అధికారంలోకి వచ్చాక సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న సినిమా వాళ్లను టీఆర్ఎస్ బెదిరించి వైసీపీలోకి పంపిస్తుందనడంలో వాస్తవం లేదంటున్నారు ఎస్.వి.కృష్ణారెడ్డి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేయగలిగిందే చెబుతారని, ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర ద్వారా జగన్‌ ప్రజల బాధను అర్థం చేసుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌లాగే ఆయన ప్రజల కోసం తపిస్తున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై నవరత్నాలు ప్రకటించారని, అవి పేద ప్రజలకు ఎంతో ఉపయోగ పడతాయన్నారు.

లైవ్ టీవి

Share it
Top