19 మంది ఎమ్మార్వోలపై కొరడా ఝుళిపించిన కలెక్టర్‌

19 మంది ఎమ్మార్వోలపై కొరడా ఝుళిపించిన కలెక్టర్‌
x
Highlights

భూరికార్డుల ప్రక్షాళనలో అలసత్వం చూపుతున్న ఎమ్మార్వోలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కొరడా ఝుళిపించారు. విధి నిర్వాహణలో అలసత్వం వహిస్తున్న వారి వేతనాలు...

భూరికార్డుల ప్రక్షాళనలో అలసత్వం చూపుతున్న ఎమ్మార్వోలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కొరడా ఝుళిపించారు. విధి నిర్వాహణలో అలసత్వం వహిస్తున్న వారి వేతనాలు ఆపాలంటూ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా డీఆర్వో కూడా చర్యలు చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా 19 మంది తాహశీల్దార్‌కు వేతనాలు ఆగిపోనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ రికార్డుల ప్రక్షాళనలో అలసత్వం వహిస్తున్న ఎమ్మార్వోలపై సూర్యాపేట జిల్లా కన్నెర్ర చేశారు. తీరు మార్చుకోని తుంగతుర్తి, నూతనకల్, సూర్యాపేట, జాజిరెడ్డి గూడెం,చివ్వేంల్, నాగారం, మోతే, పెన్‌ పహాడ్, మద్దిరాల,ఆత్మకూర్ (యస్), తిరుమలగిరి, మఠంపల్లి, మేళ్ళ చెరువు,చింతల పాలెం, నడిగూడెం, కోదాడ, హుజూర్‌ నగర్, చిలుకూరు, మునగాలకు చెందిన ఎమ్మార్వోల వేతనాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగానే వేతనాలు నిలిపివేస్తున్నట్టు డీఆర్వో చంద్రయ్య తెలియజేశారు .

19 మండలాల పరిధిలో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి స్ధాయిలో జరగకపోవడంతో రైతుల నుంచి వందలాది ఫిర్యాదులు అందాయి. వీటిని పరిష్కరించి తక్షణమే చర్యలు చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్‌ పలు మార్లు ఆయా మండలాల ఎమ్మార్వోలను ఆదేశించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వేతనాల నిలుపుదల నిర్ణయం తీసుకున్నట్టు డీఆర్వో తెలిపారు.

కలెక్టర్ తీసుకున్న నిర్ణయం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒకే 19 మంది ఎమ్మార్వోలకు వేతానాలు నిలిపివేయడం తీవ్ర కలకలం రేపింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కలెక్టర్ ఆదేశాలు అమలుచేస్తామని ట్రెజరీ ఉన్నతాధికారులు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories