శారదా చిట్ ఫండ్ కేసు: మమత సర్కార్‌కు ఎదురుదెబ్బ

శారదా చిట్ ఫండ్ కేసు: మమత సర్కార్‌కు ఎదురుదెబ్బ
x
Highlights

మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. శారదా చిట్ ఫండ్ కుంభ కోణానికి సంబంధించి పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర...

మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. శారదా చిట్ ఫండ్ కుంభ కోణానికి సంబంధించి పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఐడీ డీజీ రాజీవ్ కుమార్‌కు షాక్ తగిలింది. ఆయనను సీబీఐ అరెస్టు చేయకుండా తాము ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తోంది. ఇటేవలే పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న కారణాలతో రాజీవ్ కుమార్‌ను ఆ రాష్ట్ర సీఐడీ డీజీ బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. శారదాచిట్ ఫండ్ స్కామ్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందానికి నేతృత్వం వహించిన రాజీవ్ కుమార్ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు కోల్ కతాలోని ఆయన నివాసానికి సీబీఐ అధికారుల రావడంతో వారిని వెస్ట్ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలిపెట్టిన విషయం తెలిసిందే. రాజీవ్ కుమార్ కు మద్దతుగా సీబీఐ తీరుపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నడిరోడ్డుపై దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories