సుప్రీంకు బాబు టీమ్

సుప్రీంకు బాబు టీమ్
x
Highlights

సుప్రీంకోర్టులో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి...

సుప్రీంకోర్టులో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, సీపీఐ నేత డీ రాజా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కేసు హియరింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని 21 ప్రతిపక్ష పార్టీలు రివ్యూ పిటీషన్‌ వేశాయి. ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం కాసేపట్లో విచారణ చేపట్టనుంది.

ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ల స్లిప్పులు కూడా లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు పోరాడుతున్నాయి. గతంలో ఇదే అంశంపై విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ పరిధిలో 5, లోక్‌సభ పరిధిలో 35 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ఆదేశించింది. అయితే దీనిపై 21 పార్టీలు రివ్యూ పిటీషన్‌ వేశాయి. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని డిమాండ్‌ చేశాయి. ఇదే అంశంపై ఈసీకి చంద్రబాబు లేఖ కూడా రాశారు.

కేసు విచారణ తర్వాత వివిధ జాతీయ పార్టీ నాయకులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏడు దశల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఐదు దశలు పూర్తికావడంతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories