logo

సుప్రీంకోర్టులో కొనసాగుతోన్న శబరిమల కేసు విచారణ

సుప్రీంకోర్టులో కొనసాగుతోన్న శబరిమల కేసు విచారణ

శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. సుప్రీం తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 64 రివ్యూ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. పిటిషన్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పరాశరన్‌ వాదనలు వినిపిస్తున్నారు. అయితే రివ్యూ పిటిషన్లపై విచారణను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సీజేఐ తోసిపుచ్చారు.

లైవ్ టీవి

Share it
Top