తెలుగు రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్

తెలుగు రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్
x
Highlights

ఫిబ్రవరి నాటికి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. టీచర్ల నియామకాల్లో జాప్యం జరుగుతుందని దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారించింది.

ఫిబ్రవరి నాటికి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. టీచర్ల నియామకాల్లో జాప్యం జరుగుతుందని దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారించింది. తెలంగాణలో ప్రక్రియ పూర్తయ్యిందని, నియామక పత్రాలను అందజేయాల్సి ఉందని తెలంగాణ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. హైకోర్టులో విచారణ కారణంగా కొన్ని పోస్టులకు ఫలితాలు వెల్లడించలేదని తెలిపారు. మరోవైపు ఏపీలో డిఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి చివరి నాటికి నియామకాలు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

Show Full Article
Print Article
Next Story
More Stories